ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించే “RRR” భారీ ట్రైలర్.!

Published on Dec 8, 2021 7:05 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అలాగే దీని నుంచి మరింత మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్ ఏంటో కూడా అందరికీ తెలుసు. అదే సినిమా మాసివ్ ట్రైలర్ కోసం.

మరి అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తున్న ఈ భారీ ట్రైలర్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వైరల్ అవుతుంది.. ఈ ట్రైలర్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటిని మించే అదిరిపోయే విజువల్స్ తో రాజమౌళి నింపేసారట. చాలా గ్రాండ్ గా ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు వరకు వచ్చిన అన్ని బిగ్గెస్ట్ ట్రైలర్స్ ని మించి ఇది ఉంటుందని గట్టి టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే రేపటి వరకు ఆగక తప్పదు. గ్రాండ్ ఈవెంట్ తో ఈ ట్రైలర్ లాంచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :