సీడెడ్ లో “RRR” రెండు రోజుల భారీ వసూళ్ల వివరాలు.!

Published on Mar 27, 2022 4:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తెలుగు రాష్ట్రాలు సహా అన్ని భాషల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా కనీ వినీ ఎరుగని రీతి వసూళ్ళని డబుల్ మార్జిన్స్ తో సెట్ చేస్తూ సత్తా చాటుతుంది.

మరి లేటెస్ట్ గా డే 2 నైజాం లో మళ్ళీ నాన్ RRR రికార్డు సెట్ చేసిన ఈ చిత్రం సీడెడ్ లో కూడా రెండో రోజు మంచి వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తుంది. రెండో రోజు ఇక్కడ ఈ చిత్రం 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. దీనితో రెండు రోజులకి గాను ఈ చిత్రం 22 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే మళ్ళీ రెండో రోజు కూడా RRR సెన్సేషన్ తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవెల్లోనే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :