లేటెస్ట్ : మరో ఖ్యాతిని అందుకున్న “RRR”.!

లేటెస్ట్ : మరో ఖ్యాతిని అందుకున్న “RRR”.!

Published on Dec 2, 2022 11:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ భారీ చిత్రం రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు అయ్యినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పేరు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇక దీనితో ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటున్న ఈ చిత్రం ఇప్పటికి ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది.

ఇక లేటెస్ట్ గా అయితే మరో ఖ్యాతిని ఈ చిత్రం సాధించింది. ప్రపంచ సినిమా దగ్గర ఐ ఎం డి బి(ఇంటర్నెట్ సినిమా డేటా బేస్) వారు పొందుపరిచిన ఈ ఏడాది ప్రపంచ వ్యాప్త బెస్ట్ 50 చిత్రాల లిస్ట్ లో RRR కూడా ఒకటిగా నిలిచింది. మరి వీటిలో ఎన్నెన్నో హాలీవుడ్ సినిమాలు కూడా ఉండగా వాటితో పాటుగా ఇండియా నుంచి ఈ చిత్రం నిలిచి మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. మరి దీనితో అయితే చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు