హాలీవుడ్ నుంచి మరో అరుదైన ఫీట్ అందుకున్న “RRR”.!

హాలీవుడ్ నుంచి మరో అరుదైన ఫీట్ అందుకున్న “RRR”.!

Published on Jun 29, 2022 7:07 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పటికీ వండర్స్ నమోదు చేస్తూ దూసుకెళ్తూ ఉండడం విశేషం. అలాగే మన తెలుగు, ఇండియన్ సినిమాకి గర్వ కారణం అని చెప్పాలి.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ భారీ రెస్పాన్స్ ని అందుకుంటున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నట్లు తెలుస్తోంది. హాలివుడ్ విమర్శకుల అసోసియేషన్ నుంచి టాప్ 10 సినిమాల జాబితాలో బెస్ట్ సినిమాలలో ఒకటిగా RRR కూడా నామినేట్ అయ్యినట్టుగా వారు అనౌన్స్ చేశారు. వీటిలో RRR తప్ప మిగతా అన్ని చిత్రాలు కూడా హాలీవుడ్ నుంచే ఉండగా వాటిలో ఫస్ట్ టైం ఎంపిక కాబడిన ఇండియన్ చిత్రంగా RRR నిలిచినట్టు తెలుస్తోంది దీనితో చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు