రాజమౌళికి “RRR” గురు శిష్యుల స్పెషల్ విషెష్.!

Published on Oct 10, 2021 10:35 am IST


మన టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పుట్టినరోజు ఈరోజు కావడంతో మొత్తం భారతదేశ వ్యాప్తంగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి అలానే ఇప్పుడు తాను తెరకెక్కించిన మరో భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ లు జక్కన్నకు తమ స్పెషల్ విషెష్ ని తెలియజేసారు.

తారక్ డియర్ జక్కన హ్యాపీ బర్త్ డే టు యు లవ్ యూ అంటూ చెప్పగా అజయ్ దేవగణ్ మాత్రం తనకి ఎంతో అద్భుతమైన వర్క్ ఎక్స్ పీరియన్స్ అలాగే ఎంతో నేర్పించిన దర్శకుడు రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియజేసారు. మరి తారక్ మరియు అజయ్ లు ఈ సినిమాలో గురువు శిష్యులుగా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. సో అలా వీరి స్పెషల్ విషెష్ రాజమౌళికి చేరుకున్నాయి.

సంబంధిత సమాచారం :