బుక్ మై షో: ఆల్ ఇండియా రికార్డ్ బద్దలు కొట్టిన “RRR”

Published on Apr 3, 2022 1:08 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ సినిమా లో హీరోయిన్స్ గా నటించడం జరిగింది.

ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి వసూళ్ళను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం బుక్ మై షో లో ఆల్ ఇండియా రికార్డ్ లన్ని బద్దలు కొట్టి,. సరికొత్త రికార్డ్ సెట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ 571 కే కి పైగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఏ సినిమాకైనా ఇదే హయ్యెస్ట్ అని చెప్పాలి. 90 శాతం మంచి రేటింగ్ ను సాధించి ఈ చిత్రం టాప్ లో దూసుకు పోతుంది.

శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :