అవైటెడ్ “RRR” ట్రైలర్ పై అప్డేట్ రాబోతోందా..?

Published on Dec 3, 2021 7:09 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం నుంచి బిగ్గెస్ట్ అండ్ ఫైనల్ ప్రమోషనల్ ట్రీట్ మాసివ్ ట్రైలర్ కట్ రిలీజ్ కి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు.

మరి ఇది రిలీజ్ చెయ్యడానికి ఈ 7 కానీ 9 కానీ ఫిక్స్ కాగా మరి దీనిపై అధికారిక అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు అయితే ఇది ఈరోజే రావొచ్చట లేదా రేపు అధికారిక క్లారిటీ రానుంది అని టాక్. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ పై అప్డేట్ వచ్చేది ఇప్పుడేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందివ్వగా వచ్చే ఏడాది జనవరి7 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :