ఇండియన్ ఒటిటి హిస్టరీలో బిగ్గెస్ట్ రికార్డు కొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ

Published on Jun 23, 2022 8:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించిన భారీ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలై అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల పలు భాషల ఓటిటిల ద్వారా కూడా ప్రేక్షకాభిమానులకు అందుబాటులోకి వచ్చింది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన అనేకమంది పలు ఇతర దేశాల ప్రముఖులు, ఆడియన్స్ సైతం మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, మే 20న హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది ఆర్ఆర్ఆర్. కాగా ఈ మూవీ ఇప్పటివరకు ఏకంగా 45 మిలియన్ గంటలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని, యావత్ ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డుని సృష్టించింది. ఆ విధంగా అటు థియేటర్స్ లో కలెక్షన్ పరంగా, అలానే ఇటు ఒటిటిలో వ్యూస్ పరంగా రెండిట్లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ మూవీ స్థాయిని మరింతగా పెంచింది.

https://twitter.com/NetflixIndia/status/1539876294493499392/photo/1

సంబంధిత సమాచారం :