అక్కడ తగ్గేదే లే అంటున్న “RRR”

Published on Apr 14, 2022 10:00 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబడుతోంది. నిన్న మరో 2.7 కోట్ల రూపాయలను వసూలు చేయగా, ఇప్పటి వరకూ 240 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కి పోటీ గా ఇప్పుడు కేజీఎఫ్2 ఉండటం తో వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :