బాలీవుడ్ లో “ఆర్ఆర్ఆర్” రచ్చ మామూలుగా లేదుగా!

Published on Apr 6, 2022 4:40 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు సృష్టించగా, బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో ఇప్పటి వరకూ 198 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. ఈరోజు 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టనుంది. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా, ఈ చిత్రం అన్ని చోట్ల సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా, లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :