ఇండియాలో ఫుల్ స్వింగ్ లో “RRR” బుకింగ్స్.!

Published on Mar 20, 2022 8:38 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి వస్తున్న ఈ సినిమా బుకింగ్స్ జస్ట్ ఈ రెండు రోజులు నుంచి స్టార్ట్ అవ్వసాగాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సహా మన దేశంలో పలు భాషల్లో కూడా అక్కడక్కడా థియేటర్స్ లో సినిమా విజబుల్ వెర్షన్ లు రెండూ 2డి మరియు 3డి లలో ఆన్లైన్ లో బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ప్రతి చోట కూడా సాలిడ్ బుకింగ్స్ ని నిమిషాల్లో ఈ సినిమా నమోదు చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రిలీజ్ చేసింది ఏ తేదికి అయినా కూడా ఫుల్ స్వింగ్ లో బుకింగ్స్ నడుస్తున్నాయట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అయితే పలు చోట్ల ప్రీమియర్ షోస్ కి అయితే టికెట్ ధర ఎంత ఉన్నా కూడా ఆల్ షోస్ సోల్డ్ అవుట్ అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ భారీ సినిమా ఫస్ట్ డే ఆల్ ఓవర్ ఇండియా సాలిడ్ నెంబర్ నెలకొల్పడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :