“RRR” సెన్సేషన్..ఊహించని లెవెల్లో బుకింగ్స్ అట.!

“RRR” సెన్సేషన్..ఊహించని లెవెల్లో బుకింగ్స్ అట.!

Published on Mar 5, 2022 8:01 AM IST

మెగాపవర్ స్టార్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తార స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

అయితే గతంలో మొదటి రిలీజ్ డేట్ కే ఈ భారీ సినిమా ఫిక్స్ కాగా ఓవర్సీస్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేసినపుడు రికార్డు స్థాయి బుకింగ్స్ ని ఈ చిత్రం నమోదు చేసుకుంది. మరి అప్పుడు వాయిదా పడి మళ్ళీ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఇప్పుడు అంతకు మించి ఫైరింగ్ లెవెల్లో బుకింగ్స్ నమోదు అవుతున్నాయట.

ఆశ్చర్యకరంగా అయితే ఈ చిత్రం కేవలం 4 గంటల్లోనే 2 లక్షలకి పైగా డాలర్స్ బుకింగ్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం మామూలు సెన్సేషన్ కాదని చెప్పాలి. అలాగే ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ నాటికి బుకింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు