ఇంట్రెస్టింగ్.. ఈ ఓటీటీ యాప్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చిన “RRR”.!

ఇంట్రెస్టింగ్.. ఈ ఓటీటీ యాప్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చిన “RRR”.!

Published on Jul 26, 2022 7:22 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం”. మరి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో సెన్సేషన్ ని నమోదు చేయగా ఇక ఓటీటీ లో వచ్చాక అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా వేరే లెవెల్లోకి ఈ చిత్రం వెళ్లిపోయింది.

అయితే ఈ సినిమాని మొదట ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్ మరియు జీ5 వారు హిందీ సహా దక్షిణాది భాషల్లో రిలీజ్ చెయ్యగా ఇప్పుడు మరో స్ట్రీమింగ్ యాప్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సినిమా దక్షిణాది భాషల్లోనే మళ్లీ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఒకవేళ నెట్ ఫ్లిక్స్, జీ 5 లేని వాళ్ళు అందులో ఒక లుక్ వెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు