తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల మార్క్ ను టచ్ చేసిన RRR

Published on Apr 3, 2022 7:29 am IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజా బాక్సాఫీస్ నివేదికల ప్రకారం, RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. RRR ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ ఫీట్ అని చెప్పాలి.

RRR గ్లోబల్ మార్కెట్‌లో 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇదే విషయాన్ని నిర్మాతలు ధృవీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. యూఎస్‌ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, డివివి దానయ్య భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :