లేటెస్ట్ : జపాన్ లో కూడా కలెక్షన్స్ దుమ్మురేపిన ‘ఆర్ఆర్ఆర్’ …. ఎంతంటే ?

లేటెస్ట్ : జపాన్ లో కూడా కలెక్షన్స్ దుమ్మురేపిన ‘ఆర్ఆర్ఆర్’ …. ఎంతంటే ?

Published on Nov 7, 2022 10:07 PM IST

టాలీవుడ్ స్టార్ నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది మార్చిలో పలు భాషల్లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అత్యద్భుత నటన కనబరచగా, రాజమౌళి మరొక్కసారి తన అద్వితీయమైన దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీని ఇటీవల జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసింది యూనిట్.

అయితే విషయం ఏమిటంటే, అక్కడ కూడా సూపర్ గా క్రేజ్, కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ఇప్పటివరకు మొత్తంగా 17 రోజులకు గాను 185 మిలియన్ జపనీస్ యన్ లు సాధించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10.34 కోట్లు అన్నమాట. ఇక ఈ మూవీ జపాన్ లో 122కె ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకుంది. కాగా జపాన్ లో ఇప్పటివరకు విడుదలై భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ముత్తు ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, బాహుబలి 2 సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ముచ్చటగా మూడవ ప్లేస్ ని సొంతం చేసుకోవడం విశేషం. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ జపాన్ రిలీజ్ లేటెస్ట్ కలెక్షన్స్ పోస్టర్ ని ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు