ఓటిటిలో వరల్డ్ వైడ్ హవా కొనసాగిస్తున్న “RRR”.!

Published on Jun 5, 2022 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ప్రపంచ స్థాయి బాక్సాఫీస్ దగ్గర భారీ నంబర్స్ నమోదు చేసి అదరగొట్టింది.

ఇక ఓటిటి లో రిలీజ్ అయ్యాక అయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ మరియు జీ 5 లో రిలీజ్ అయ్యింది. అయితే జీ 5 లో వచ్చిన మూడు రోజులకే రికార్డు మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం అప్పుడు వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్స్ లో నెంబర్ 1 కి రాగా ఇప్పుడు మూడు వారాలు గడుస్తున్నా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ అవుతున్నట్టుగా తెలిపారు. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇలా కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం :