జపాన్‌లో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ దూకుడు!

Published on Feb 26, 2023 5:00 pm IST

రౌద్రం రణం రుధిరం చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో పలు అవార్డులను గెలుచుకోవడం ద్వారా ప్రతి భారతీయ సినిమా అభిమానిని గర్వించేలా చేసింది. అంతర్జాతీయ అవార్డ్ షోలో ఈ చిత్రానికి గుర్తింపు రావడంతో RRR చిత్ర యూనిట్ ఎంతో ఉప్పొంగిపోయింది. ఈ చిత్రం ఇటీవల జపాన్‌లో 1 బిలియన్ జపనీస్ యెన్ మార్కును అధిగమించింది. తద్వారా ఈ దేశంలో అలా వసూళ్లను రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.

తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం మరో 100 మిలియన్లు వసూలు చేసి దేశంలో మొత్తం 1.1 బిలియన్లకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ప్రాంతంలో ఇంకా దూకుడు కొనసాగించేలా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోని ఇద్దరు పెద్ద మాస్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సౌండ్‌ట్రాక్‌లు సమకూర్చారు.

సంబంధిత సమాచారం :