నెట్ ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’

నెట్ ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’

Published on Jul 27, 2022 10:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఇటీవల రిలీజ్ తరువాత ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించారు. ఓవైపు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ప్రస్తుతం జీ5, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఓటిటి మాధ్యమాల్లో కూడా భారీ వ్యూస్ తో కొనసాగుతోంది.

కాగా ఈ మూవీ నేటితో నెట్ ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ గా ఇప్పటివరకు ఏకంగా 10 వారాల పాటు టాప్ లో ట్రెండ్ అయిన నాన్ ఇంగ్లీష్ మూవీగా నిలిచింది ఆర్ఆర్ఆర్. నిజానికి ఈ మూవీకి కేవలం ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాక అనేక ఫారెన్ దేశాల ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుని భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. అందుకే మూవీ ఓటిటిలో కూడా ఈ రేంజ్ లో అదరగొడుతోంది. మొత్తంగా తమ మూవీకి ఇంతటి గొప్ప రికార్డు దక్కడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు