అక్కడ 5 రోజుల్లో 100 కోట్లు కొట్టేసిన “RRR” సెన్సేషన్.!

Published on Mar 30, 2022 8:00 am IST


పాన్ ఇండియా సినిమా దగ్గర అన్ని భాషల్లో కూడా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని అంచనాలు అందుకొని రాజమౌళి కెరీర్ లో మరో తిరుగు లేని విజయంగా మారడమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారింది.

అయితే అన్ని భాషల్లో కూడా కూడా సాలిడ్ వసూళ్ళని అందుకొని వెళ్తున్న ఈ సినిమా హిందీలో కూడా స్ట్రాంగ్ గా నిలిచింది. లేటెస్ట్ గా అయితే అక్కడ ఇప్పుడు జస్ట్ 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన మరో సౌత్ ఇండియన్ సినిమాగా మారింది. ఈ మంగళవారం 5వ రోజుకి గాను 16 కోట్ల నెట్ వసూళ్లు సాధించి టోటల్ గా 107 కోట్లు అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి లాంగ్ రన్ లో అయితే 200 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది అని చెప్పాలి. మరి ఫైనల్ మార్క్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :