యూఎస్ కలెక్షన్స్‌లో మరో మార్క్ టచ్ చేసిన “ఆర్ఆర్ఆర్”..!

Published on Apr 8, 2022 12:03 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబట్టుకుంటూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలై 10 రోజులు దాటినా కలెక్షన్ల జైత్రయాత్ర ఏ మాత్రం తగ్గడంలేదు.

ఇక అమెరికాలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. ప్రీమియర్లతో పాటు ఇప్పటివరకు మొత్తం గ్రాస్ 13 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఈ ఏడాదిలో భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సాధించింది.

సంబంధిత సమాచారం :