నైజాంలో తుక్కు రేగ్గొడుతున్న “RRR”..రెండో రోజు కూడా ఆల్ టైం రికార్డ్!

Published on Mar 27, 2022 11:02 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు విడుదల అయ్యి ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

మరి ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అయితే ఇండస్ట్రీ వర్గాలని నివ్వెర పోయేలా చేస్తున్నాయి. మొదటి రోజే ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో డబుల్ మార్జిన్స్ తో కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు రెండో రోజు కూడా అంతే సాలిడ్ హోల్డ్ కనబరిచింది. మరి రెండో రోజుకి గాను ఈ చిత్రం 15 కోట్ల షేర్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో రెండు రోజులకి కలిపి ఈ చిత్రం 38.3 కోట్లు అందుకొని నాన్ RRR రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ తుక్కు రేగ్గొడుతుంది.

సంబంధిత సమాచారం :