నైజాంలో “RRR” 4వ రోజు సాలిడ్ వసూళ్ల వివరాలు..!

Published on Mar 29, 2022 2:35 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యిన ఈ చిత్రం అన్ని వర్గాల్లో కూడా రికార్డు స్థాయి వసూళ్లను అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేస్తూ వెళ్తుంది.

అయితే మొదటి మూడు రోజులు కూడా ఆల్ టైం రికార్డు వసూళ్లతో వారాంతాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సోమవారం టెస్టింగ్ డే కూడాసాలిడ్ వసూళ్ళని అందుకుంది. లేటెస్ట్ గా నైజాం లో ఈ చిత్రం నాల్గవ రోజు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్కడ 6.9 కోట్ల రూపాయల షేర్ ని అందుకుంది. దీనితో ఈ వారం కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకుందని చెప్పాలి. అలాగే అక్కడ బ్రేకీవెన్ వసూళ్ళని కూడా అతి త్వరలోనే ఫినిష్ చేసేస్తుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :