“RRR” ప్రమోషనల్ సాంగ్ ఇంకో లెవెల్లో ఉంటుందట.!

“RRR” ప్రమోషనల్ సాంగ్ ఇంకో లెవెల్లో ఉంటుందట.!

Published on Jul 29, 2021 7:06 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “RRR” కోసం ఆడియెన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కానీ అంతకు ముందు అదిరే ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. మరి వాటిలో ఈ చిత్రం మొట్ట మొదటి సాంగ్ కూడా ఒకటి. జస్ట్ ఫస్ట్ సింగిల్ లాంచ్ అనే కాకుండా దీనిని చాలా గ్రాండ్ గా కూడా ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసారు.

మొత్తం ఐదు భాషలకు గాను ఐదుగురు ఫైనెస్ట్ సింగర్స్ తో సంగీత దర్శకుడు కీరవాణి దీనిని ప్లాన్ చెయ్యగా దీనిపై తాజాగా సింగర్ హేమచంద్ర మాట్లాడిన సూపర్ ఎగ్జైటెడ్ వీడియోని మేకర్స్ వదిలారు. అయితే ఈ సాంగ్ లో ప్రతీ లిరిక్ అద్భుతంగా ఉంటుంది అని ముఖ్యంగా ఈ సాంగ్ ని అయితే ప్రమోషనల్ గా ఇంకో లెవెల్లో తెరకెక్కించారని మాటల్లో చెప్పలేని విధంగా ఎగ్జైట్ అవుతూ తెలిపాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే ఆగష్టు 1 ఉదయం 11 గంటల వరకు ఆగాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు