“RRR” ఎఫెక్ట్..తమ హీరోయిన్ సినిమా వాయిదా.?

“RRR” ఎఫెక్ట్..తమ హీరోయిన్ సినిమా వాయిదా.?

Published on Oct 3, 2021 10:02 AM IST


పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” సినిమాపై నిన్ననే మేకర్స్ ఓ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 7వ తేదీన రిలీజ్ అవుతుంది అని దర్శకుడు రాజమౌళి సహా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కన్ఫర్మ్ చేశారు. దీనితో అనేక సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు అనుకున్నట్టుగానే వచ్చేసింది.

అయితే ఈ సినిమా ఎఫెక్ట్ ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గట్టిగానే ఉంది. ఈ సినిమాలో చరణ్ సరసన నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బాలీవుడ్ లో చేసిన సినిమా “గంగూబాయి ఖతియావాది” పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాని జనవరి 6న రిలీజ్ ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు “RRR” సినిమా రేస్ లోకి రావడంతో అలియా సినిమా ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యినట్టు సమాచారం వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు