లేటెస్ట్..తమ పాత డేట్ పై కన్నేసిన “RRR” చిత్రం?

Published on Sep 10, 2021 2:15 pm IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ లెవెల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి షూట్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ భారీ చిత్రం నిజానికి ఈ ఏడాదిలో రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పరిస్థితులు రీత్యా సినిమా వాయిదా పడింది. ఇక ఈ భారీ చిత్రం విడుదల ఎప్పుడు అన్నదానికి ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. అల్రెడీ ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కి ఫిక్స్ అయ్యి అక్టోబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి ఈ ఏడాది సంక్రాంతి రేస్ కి మిస్ చేసిన డేట్ కే మళ్ళీ వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారట.

అంటే వచ్చే ఏడాది జనవరి 8న ఈ భారీ చిత్రం థియేటర్స్ లో పడనున్నట్టుగా నయా టాక్.. మరి దీనికి సంబంధించే మేకర్స్ నుంచి ఒక అధికారిక క్లారిటీ కొన్ని రోజుల్లో రానుంది అని కూడా టాక్ ఉంది. మరి ఇదెప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :