నైజాంలో RRR ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Published on Apr 2, 2022 12:02 am IST

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన RRR ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రంలో అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా అత్యధికంగా నైజాంలో 7వ రోజు 3.3 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా తొలి వారంలో 73 కోట్ల షేర్ రాబట్టింది.

ఈ సినిమా నైజాం హక్కులను డిస్ట్రిబ్యూటర్లు రూ. 75 కోట్ల రూపాయల కి సొంతం చేసుకున్నారు. ప్రచారం, ఇతర ఖర్చులతో కలిపి మొత్తం RRR కోసం 83 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ కావాలంటే మరో 10 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదల కానందున ఈ వారం RRR మంచి వసూళ్లను సాధించడం ఖాయం. డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియన్ చిత్రంలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :