“ఆర్ఆర్ఆర్” క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతోందిగా!

Published on May 1, 2022 11:02 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రల్లో నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇంకా పలు చోట్ల మంచి వసూళ్ళను రాబడుతోంది.

ఈ చిత్రం లోని పాటలు ఒక రేంజ్ లో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాయి. ఈ చిత్రం లో కొమురం భీముడో పాటకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ పాటకి రీల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక రీల్ ను ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో కు హహ క్యూటీస్ అంటూ కామెంట్స్ చేయడం జరిగింది.

ఈ చిత్రం లోని అన్ని పాటలకి క్రేజ్ రావడమే కాకుండా, చిత్రం లోని విజువల్స్ కి రోజురోజుకీ ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఏ తరహా వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :