“ఆర్ఆర్ఆర్” కి జపాన్ లో రెస్పాన్స్ మామూలుగా లేదుగా!

“ఆర్ఆర్ఆర్” కి జపాన్ లో రెస్పాన్స్ మామూలుగా లేదుగా!

Published on Nov 1, 2022 6:26 PM IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం కి జపాన్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి ఇప్పటి వరకూ అక్కడ 5,610 కి పైగా పాజిటివ్ రివ్యూ లను అందుకున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ పేర్కొంది. యావరేజ్ 4.4 రేటింగ్ ను ఇచ్చినట్లు పేర్కొంది. ఈ చిత్రం మరింత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు