ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లింప్స్ కి సర్వం సిద్ధం

Published on Oct 31, 2021 8:17 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. వీరి సరసన బాలివుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన ముహూర్తం ను చిత్ర యూనిట్ ఖరారు చేయడం జరిగింది. నవంబర్ 1 వ తేదీన ఉదయం 11 గంటలకు గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ సరికొత్త పోస్టర్ తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :