శరవేగంగా “RRR”..టార్గెట్ అప్పటికే..!

శరవేగంగా “RRR”..టార్గెట్ అప్పటికే..!

Published on Sep 16, 2021 8:01 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వైపుంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఆల్రెడీ అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం అధికారికంగా ఈ వచ్చే అక్టోబర్ రేస్ నుంచి తప్పుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయ్యిపోయాయట. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. వచ్చే రెండు నెలలోపే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ కాపీ ని రెడీ చేసేసి జనవరి సంక్రాంతి రేస్ నే టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చెయ్యాలని సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా కోసం మాత్రం వీక్షకులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పరిస్థితులు సహకరిస్తే ఇంకా బాగుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు