ఓవర్సీస్ లో “బాహుబలి 2” రికార్డ్ దిశగా “RRR” బుకింగ్స్.!

Published on Mar 20, 2022 3:34 pm IST

మళ్ళీ చాలా కాలం అనంతరం ఓ తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఇంపాక్ట్ కలిగించడానికి సిద్ధం అవుతుంది. ఆ సినిమానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”.

రాజమౌళి నుంచి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ “బాహుబలి 2”, అలాగే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడంతో తారా స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డు బ్రేకింగ్ బుకింగ్ ప్రీమియర్స్ కి బుక్ అవుతున్న సంగతి తెలిసిందే.

మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ నాటికి అయితే డెఫినెట్ గా బాహుబలి 2 పేరిట ఉన్న 2.45 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చెయ్యడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇదే జరిగితే ఇక ఇక్కడ నుంచి బాహుబలి స్థానాన్ని RRR టేకప్ చేసినట్టే అని చెప్పాలి. మరి చూడాలి ఈ భారీ సినిమా లాస్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో అనేది.

సంబంధిత సమాచారం :