చెన్నై లో గ్రాండ్ గా మొదలు కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక

Published on Dec 27, 2021 1:33 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ను జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా వస్తుండటం తో అన్ని భాషల్లో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. నేడు చెన్నై లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ను చెన్నై ట్రేడ్ సెంటర్ లో నిర్వహించనున్నారు మేకర్స్. నేడు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :