గోదారి జిల్లాలు, గుంటూర్, ఉత్తరాంధ్రలో “RRR” సాలిడ్ వసూళ్ల వివరాలు!

Published on Mar 26, 2022 3:00 pm IST

పాన్ ఇండియా సెన్సేషన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఓ రేంజ్ లో అదరగొడుతూ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని అందుకొని అదరగొడుతుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వసూళ్ళని కలెక్ట్ చేస్తూ రికార్డ్స్ సెట్ చేస్తున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రాంతాల వారీగా వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

తాజాగా నైజాం మరియు సీడెడ్ వసూళ్ల వివరాలు బయటకు రాగా ఇప్పుడు మిగిలిన కీలక ప్రాంత్రాలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ చిత్రం గుంటూర్ లో 7.26 కోట్లు వసూలు చేయగా ఈస్ట్ దోదావారిలో 5.55 కోట్లు, వెస్ట్ లో 5.93 కోట్లు అలాగే ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయల షేర్ ని మొదటి రోజు ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది.

ఆల్రెడీ సాలిడ్ మౌత్ టాక్ ఉంది ముందు రోజుల్లో మరింత స్థాయిలో భారీ స్థాయి వసూళ్లు నమోదు కావడం ఖాయం అని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :