జపాన్ లో పాతుకుపోతున్న “RRR”.!

Published on Mar 16, 2023 7:11 am IST

గ్లోబల్ స్టార్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరలెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న ఈ సినిమా చరిత్ర సృష్టించింది. అయితే గత అక్టోబర్ లో జపాన్ దేశంలో రిలీజ్ అయ్యినటువంటి ఈ చిత్రం థియేట్రికల్ గా అక్కడ వండర్స్ నమోదు చేస్తుంది. ఆల్రెడీ 100 రోజులు రికార్డ్ రన్ అలాగే 1 బిలియన్ జపాన్ యిన్ వసూళ్లు ఇప్పుడు అక్కడ సినిమా ఇంకా 20 వారాలు దాటినప్పటికీ ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుందట. దీనితో జపాన్ లో RRR పాతుకుపోయింది అని చిత్ర యూనిట్ అమితంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 200 కి పైగా థియేటర్స్ లో హిస్టారికల్ రన్ ని కొనసాగిస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమా జపాన్ లో మాత్రం వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యిందని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం :