“RRR” హంగామా కూడా అప్పటి నుంచే అట.!

Published on Mar 11, 2022 8:03 am IST

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు పాన్ ఇండియా సినిమాల హవా స్టార్ట్ అయ్యిపోయింది. నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” స్టార్ట్ అయ్యి ఇక ముందు నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లిస్ట్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి.

మరి ఈ సినిమా నుంచి నిన్ననే మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అదరగొట్టారు. అయితే ఈ 14న రిలీజ్ చెయ్యబోయే కొత్త సాంగ్ తో పాటు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ 14 నుంచే మళ్ళీ ఈ చిత్ర యూనిట్ అదిరే ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారట. మరి ఆల్రెడీ ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. దాన్ని ఇలాంటి ఒక మాస్ సాంగ్ స్టార్ట్ చెయ్యడం ఆసక్తిగా ఉందని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :