“RRR” హైప్..ఓవర్సీస్ లో అప్పుడే రికార్డు బుకింగ్స్.!

“RRR” హైప్..ఓవర్సీస్ లో అప్పుడే రికార్డు బుకింగ్స్.!

Published on Dec 18, 2021 4:00 PM IST

ప్రతీ భారతీయుడు కూడా ప్రపంచ నలు మూలల్లో ఎక్కడ ఉన్నా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత ఏకైక సినిమా “RRR” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన భారీ సినిమా ఇది. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడుతుండడంతో చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు.

మరి నిన్ననే ఈ సినిమా యూ ఎస్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెన్ కాగా ఊహించని రేంజ్ సేల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అక్కడ ఈ సినిమా హైప్ ఏ రంగ్ రేంజ్ లో ఉంది అంటే నిన్ననే ఓపెన్ చేసిన ఈ సేల్స్ ఈరోజుకి ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. దీనిని బట్టి ‘RRR’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే జనవరి 6 నాటికి అక్కడ పరిస్థితి ప్రీ సేల్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు