“RRR” జపాన్ లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

“RRR” జపాన్ లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

Published on Nov 16, 2022 11:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ అయితే అందుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈ చిత్రం జపాన్ దేశంలో కూడా రిలీజ్ కాగా అక్కడ కూడా సెన్సేషన్ ని నమోదు చేస్తూ భారీ వసూళ్లు అక్కడ అందుకుంది. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం జపాన్ వసూళ్లు తెలుస్తున్నాయి.

మరి ఈ సినిమా 1.38 లక్షల డాలర్స్ ని ఈ నాలుగో వీకెండ్ లో నమోదు చెయ్యగా దీనితో అయితే ఈ చిత్రం అక్కడ ఇప్పుడు 14 కోట్ల మార్క్ కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికీ అయితే జపాన్ లో మంచి హోల్డ్ లోనే కొనసాగుతున్న RRR ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందో అనేది మరింత ఆసక్తిగా మారింది. ఇండియన్ సినిమా నుంచి అయితే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా ఇది నిలుస్తుందా లేదా అని చాలా మంది చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు