అక్కడ కూడా “ఆర్ఆర్ఆర్” సెన్సార్ పూర్తి..!

Published on Mar 13, 2022 5:34 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం ను ప్రపంచ వ్యాప్తంగా భారీగా మార్చ్ 25 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ చిత్రం సౌదీ అరేబియా లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది అని, మార్చ్ 24 వ తేదీన ప్రీమియర్స్ తో విడుదల కానున్నట్లు తెలిపింది. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :