లేటెస్ట్ : పవర్ స్టార్ మూవీ రూమర్స్ ని ఖండించిన ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్

Published on Sep 6, 2022 12:02 am IST

ఇటీవల టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ గ్లోబల్ గా ఎంతో పెద్ద సక్సెస్ ని భారీ కలెక్షన్స్ ని అందుకుని గొప్ప పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు.

అయితే ఆ మూవీ తరువాత డివివి బ్యానర్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ మూవీ రానుందని, దీనిని తమిళ సూపర్ హిట్ మూవీ తేరి కి రీమేక్ గా తెరకెక్కించనున్నారని, నేటి ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. కాగా ఈ న్యూస్ పై కొద్దిసేపటి క్రితం స్పందించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు, తమ సంస్థ నుండి ఏదైనా మూవీ ఓకే అయితే తామే అఫీషియల్ గా ప్రకటిస్తాం అని, కావున ప్రస్తుతం తమ బ్యానర్ పై పవన్, సుజీత్ ల మూవీ నిర్మాణ విషయమై ప్రచారం అవుతున్న న్యూస్ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని వారు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :