ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే సాలిడ్ అప్డేట్ ఇచ్చిన “RRR” యూనిట్.!

Published on Dec 28, 2021 2:00 pm IST


ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి వారికి సాలిడ్ ట్రీట్ ఇచ్చే విధంగా మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్ లు ఇస్తూ వస్తున్నారు. మరి ఇపుడు ఈ చిత్రం ముఖ్యంగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. కేవలం ఫ్యాన్స్ కోసం తమ అల్లూరి సీతా రామ్ రాజు అలాగే కొమరం భీం ఎన్టీఆర్ ల సోలో స్టిల్స్ ని సరికొత్తవి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమా నుంచి ఇద్దరి హీరోల తాలూకా కొత్త లుక్స్ ని ఎన్ని సార్లు కూడా తనివి తీరానట్టే ఉన్నాయి. మరి ఈ కొత్త పోస్టర్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక.

సంబంధిత సమాచారం :