వరల్డ్ వైడ్ గా రూల్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మేనియా …. !!

వరల్డ్ వైడ్ గా రూల్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మేనియా …. !!

Published on Jun 27, 2022 11:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ మార్చి 25న రిలీజ్ అయి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన విషయం తెలిసిందే.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇక ఇటీవల ఓటిటి లో కూడా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న మూవీగా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరి నుండి కూడా విశేషమైన ప్రశంసలు అందుకుంటూ ఉంది. ముఖ్యంగా పలు ఇతర దేశాల ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ కి చెందిన పలువురు నటులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ సైతం ఆర్ఆర్ఆర్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి పై అలానే ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచిన హీరోలిద్దరి పై ప్రశంశలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు. బాహుబలి రెండు సినిమాలతో టాలీవుడ్ రేంజ్ ని మార్కెట్ ని అమాంతం పెంచేసిన రాజమౌళి, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో అమాంతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు దక్కేలా చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు