“RRR” మాస్ నెంబర్ కాస్త ముందే వచ్చేస్తుంది..సిద్ధం కండి

Published on Nov 10, 2021 9:59 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం” నుంచి చిత్ర యూనిట్ రీసెంట్ గా సినిమా సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చి ప్రోమో రిలీజ్ చెయ్యడంతో మొత్తం అన్ని భాషల్లో కూడా ఈ పక్కా మాస్ బీట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఎప్పుడెప్పుడు విందామా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ఇపుడు సినిమా అభిమానులకి ఇంకా ఎగ్జైటింగ్ అప్డేట్ ని అందించారు. మాములుగా ముందు ప్లాన్ చేసిన 4 గంటలకి కాకుండా ఈరోజు సాయంత్రం 3 గంటలకే ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సాంగ్ అందించడానికి ఎక్కువ సమయం మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేదని అందుకే ముందే గంట ముందే రిలీజ్ చేస్తున్నాం వూఫర్స్ తో సిద్ధంగా ఉండమని చెప్పేసారు. దీనితో కీరవాణి అందించిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ కోసం మరింత ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :