ఆల్మోస్ట్ కన్ఫర్మ్..ఈ డేట్ కి “RRR” మాసివ్ ట్రైలర్.!

Published on Dec 4, 2021 11:12 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని హైప్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ నిన్న డిసెంబర్ 3కి ఫిక్స్ చెయ్యగా అది ఓ అనివార్య కారణం చేత రిలీజ్ కాలేదు. మరి మళ్ళీ కొత్త అప్డేట్ తో డేట్ ని రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేసారు.

అయితే ఈ రిలీజ్ కి గాను రెండు తేదీలు వినిపించగా లేటెస్ట్ గా అయితే ఆల్ మోస్ట్ ఈ వచ్చే డిసెంబర్ 9 ఫిక్స్ అయ్యిపోయినట్టు గట్టి సమాచారం వినిపిస్తుంది. మరి దీనిపైనే ఓ అధికారిక క్లారిటీతో అంతే కాకుండా సరికొత్త పోస్టర్ అప్డేట్ రాబోతుందట. మరి ఈ అప్డేట్ ఎప్పుడు మేకర్స్ రివీల్ చేస్తారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :