“RRR” ఆల్బమ్ లోనే మోస్ట్ అవైటెడ్ సాంగ్ వచ్చేస్తుంది.!

Published on May 5, 2022 7:07 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ ఒక్కో పాటని అలాగే సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని కొన్ని రోజులు గ్యాప్ లలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి ఒక అపురూపమైన మ్యూజిక్ ఆల్బమ్ ఇస్తే దానిలో మాత్రం సినిమా చూసాక భారీ రీచ్ మరియు ఆదరణ వచ్చిన ఒకటి ఉంది ఆ పాటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఎమోషనల్ సాంగ్ “కొమురం భీముడో”.

సినిమా రిలీజ్ కి ముందు అంత చార్ట్ బస్టర్ కాలేదు కానీ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేసాడు. అందుకే ఈ వీడియో సాంగ్ కోసం ఎప్పుడు నుంచో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఈ సాంగ్ ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఫైనల్ గా అప్డేట్ ని అందించారు. మరి ఈ సాంగ్ రేపు మే 6 సాయంత్రం 4 గంటలకి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పిన ఈ అనౌన్సమెంట్స్ అయితే చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :