మాస్ ఫెస్టివల్ తెచ్చేసిన “RRR” మాస్ నెంబర్.!

Published on Nov 10, 2021 3:11 pm IST

ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అసలు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కన్నా రెండో పాట కోసమే ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకే తెలుసు. నిన్న ప్రోమోతో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ నెంబర్ ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యిపోయింది.

మరి అనుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సాంగ్ ఊరమాస్ గా పక్కా నాటు గానే ఉందని చెప్పాలి. చంద్రబోస్ సాహిత్యం రాహుల్ గాత్రం వీటన్నటినీ మించి తారక్, చరణ్ లు కలిసి వేస్తున్న స్టెప్స్ బిట్స్ చూస్తుంటే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం అనిపిస్తుంది ఇందులో నో డౌట్.

ఇంత చెప్పుకున్నాక కూడా కీరవాణి గారు ఇచ్చిన ఈ గ్రాండ్ అండ్ మాస్ బీట్ కోసం ప్రత్యేకంగా మెన్షన్ చేయనవసరం లేదు ఆ రేంజ్ బీట్ పండుగ చేసుకోమని అభిమానులకు మాస్ ఆడియెన్స్ కి ఇచ్చేసారు. ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సాంగ్ ఫెస్టివల్ ఎక్కడా తగ్గదు అని చెప్పి తీరాలి.

నాటు నాటు సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More