RRR రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారోచ్..!

Published on Oct 2, 2021 6:48 pm IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. గతంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2022 జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నట్టు లేటెస్ట్‌గా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.

సంబంధిత సమాచారం :