RRR కొత్త ట్రైలర్ లోడ్ అవుతుందా?

Published on Mar 3, 2022 8:00 pm IST


చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RRR. ఈ నెల 25న సినిమాను భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మరి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి మరి. బజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి సరికొత్త ట్రైలర్‌ని రెడీ చేస్తున్నాడని తెలిసింది.

రానున్న రోజుల్లో రెండు మెగా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ వివిధ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో విడుదల కానుందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :