‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరొక ప్రెస్టీజియస్ మొమెంట్

‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరొక ప్రెస్టీజియస్ మొమెంట్

Published on Dec 15, 2022 1:00 AM IST


తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవ్యాప్తం చేసిన దిగ్గజ దర్శకడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ గ్రాండియర్ విజువల్ వండర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇక రిలీజ్ తరువాత ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ దాదాపుగా రూ. 1150 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్ సహా అనేక దేశాల ఆడియన్స్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. అది మాత్రమే కాక ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులు సైతం వచ్చి చేరాయి.

ఇటీవల ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఫిలిం, అలానే బెస్ట్ సాంగ్ విభాగాల్లో నామినేషన్ దక్కించుకోగా నేడు ప్రఖ్యాతి చెందిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో మొత్తం ఐదు క్యాటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ , బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, అలానే బెస్ట్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ నామినేషన్లో నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ యొక్క ప్రభంజనం ఈ విధంగా కొనసాగుతుండడంతో దేశవ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు, మూవీ లవర్స్, ప్రేక్షకాభిమానులు మూవీ యూనిట్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు