“RRR” సెన్సేషన్..జపాన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా లేటెస్ట్ వసూళ్లు.!

“RRR” సెన్సేషన్..జపాన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా లేటెస్ట్ వసూళ్లు.!

Published on Dec 16, 2022 2:30 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ అండ్ భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ చిత్రం రీసెంట్ గానే జపాన్ దేశంలో కూడా ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కాగా అక్కడ అనుకున్నట్టుగానే ఈ చిత్రం సెన్సేషన్ ని నమోదు చేసింది.

రికార్డు వసూళ్లతో ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోగా అందరు అనుకున్నట్టే ఇండియన్ సినిమా నుంచి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా అయితే ఈ చిత్రం నిలిచింది. మరి ఈ న్యూస్ గత కొన్నాళ్ల కితమే బయటకి రాగా ఇప్పుడు అయితే మేకర్స్ దీనిని అధికారికంగా అనౌన్స్ చేశారు.

మరి ఈ చిత్రం జపాన్ లో ఈ 55 రోజుల్లో మొత్తం 410 మిలియన్ల జపాన్ యిన్స్ వసూలు చేసి బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా అయితే నిలిచింది. అలాగే అక్కడ ఫుట్ ఫాల్స్ లో కూడా ఆల్ టైం రికార్డు నమోదు చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు, మరి 2 లక్షల 71 ఫుట్ ఫాల్స్ ని జపాన్ లో సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే జపాన్ లో మాత్రం RRR ఇప్పుడు పాగా వేసేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు