“ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్‌ వాడిన బైక్‌కి ఎంత ఖర్చు చేశారంటే?

Published on Mar 25, 2022 11:33 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురుంచి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ వాడిన బైక్‌పై కూడా తెగ చర్చ నడుస్తుంది. అసలు ఎన్టీఆర్‌ వాడిన బైక్ ఏ కంపెనీకి చెందింది? దాని ధర ఎంత? అనే దానిపై నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ వాడిన బైక్‌ పేరు వెలోసెట్‌ మోటార్‌ బైక్‌ అని, ఇది బ్రిటన్‌కు చెందిన కంపెనీ అని తెలుస్తుంది. 1920-50 వ‌ర‌కు అంత‌ర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ఈ బైక్ అగ్రస్థానంలో ఉండేదట. 1971లో కంపెనీ ఈ బైకుల ఉత్ప‌త్తిని ఆపేసింది. అయితే అప్పటి మోడల్ బైక్ కోసం రాజమౌళి చాలా ట్రై చేశారని, చివరికి ఎక్కడా దొరక్కపోవడంతో అప్పటి బైకులు ఎలా ఉండేవో తెలుసుకుని సుమారు 20 లక్షల రూపాయల వరకూ ఖర్చు అయినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :